Current Date: 31 Mar, 2025

నేడు చెన్నైకి సీఎం చంద్ర‌బాబు

సీఎం చంద్ర‌బాబు నాయుడు ఈరోజు చెన్నైకి వెళ్తున్నారు. ఇవాళ ఉద‌యం 10.30 గంట‌ల‌కు విజ‌య‌వాడ నుంచి ప్ర‌త్యేక విమానంలో చెన్నైకి వెళ్ల‌నున్నారు. మీనంబాక్కంలోని పాత ఎయిర్‌పోర్టులో వీఐటీ గేట్ నుంచి నేరుగా ఐఐటీ మ‌ద్రాస్ క్యాంప‌స్‌కు చేరుకుంటారు. అక్క‌డ జ‌రిగే ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాల‌ర్స్ స‌మ్మిట్ - 2025లో పాల్గొని విద్యార్థుల‌ను ఉద్దేశించి ముఖ్య‌మంత్రి ప్ర‌సంగించ‌నున్నారు.  ఇక చెన్నైలోని టీడీపీ శ్రేణులు సీఎం చంద్ర‌బాబుకు ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయ‌ని స‌మాచారం. ఉద‌యం 11.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల వ‌ర‌కు స‌మ్మిట్‌లో పాల్గొననున్నారు. అక్క‌డ అన్ని కార్య‌క్ర‌మాలు ముగించుకుని తిరిగి సాయంత్రం 4 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌కు చేరుకుంటారు.

Share