Current Date: 30 Jun, 2024

చిన్నమ్మకు చెక్ పెట్టిందెవరు?

కేంద్ర మాజీ మంత్రి బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరికి చెక్ పెడుతున్నది ఎవరు అన్న చర్చ సాగుతోంది. ఆమె ఈసారి తప్పనిసరిగా కేంద్ర మంత్రి అవుతారని అంతా భావించారు. ఆమె సైతం రాజమండ్రీలో భారీ మెజారిటీతో గెలిచి వచ్చారు. దాంతో ఆమెకు కేబినెట్ ర్యాంక్ తో మంచి శాఖ ఇస్తారని అనుకున్నారు. తీరా చూస్తే కేంద్ర మంత్రి మండలిలో అనూహ్యమైన పేర్లు కనిపించాయి. బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ శ్రీనివాసవర్మను తీసుకున్నారు. అలా చిన్నమ్మకు కేంద్ర మంత్రి పదవి దక్కకుండా పోయింది.  దాంతో పాటుగానే కొత్త ప్రచారానికి తెర లేచింది. ఆమెను స్పీకర్ పదవికి ఎంపిక చేయడానికే ఇదంతా అని అన్నారు. ఆమె దేశంలో అత్యున్నతమైన రాజ్యాంగ పదవికి ఎంపిక కాబోతున్నారు అని గత పది రోజులుగా ప్రచారం హోరెత్తింది. 

Share