రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వెంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశారని, ఆ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబర్ 28న పూజల్లో పాల్గొనాలని వైసీపీ పిలుపునిచ్చింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి సిద్ధమయ్యారు. అయితే జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్ కోరినట్లే వైఎస్ జగన్ నుంచీ తీసుకోవాలని టీటీడీ అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ముందుగానే అతిధి గృహం వద్దకు వెళ్లి ఆయనకు డిక్లరేషన్ ఫారాన్ని అందించనున్నారు. ఆయన సంతకం చేస్తే దర్శనానికి అనుమతిస్తారు. తిరస్కరిస్తే దేవాదాయ శాఖ చట్టప్రకారం నడుచుకుంటామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
Share