Current Date: 26 Nov, 2024

అరుంధతీరాయ్‌పై కేసు ఎత్తేయాలి డిమాండ్‌ చేసిన హెచ్‌ఆర్‌ఎఫ్‌

సెంట్రల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ కశ్మీర్‌ మాజీ ప్రొఫెసర్‌, రచయిత్రి అరుంధతీరాయ్‌పై నమోదైన కేసుల్ని ఎత్తేయాలంటూ ఆంధ్రా, తెలంగాణా హ్యూమన్‌ రైట్స్‌ ఫోరం (హెచ్‌ఆర్‌ఎఫ్‌), ఒడిశాకు చెందిన గణతంత్రిక్‌ అధికార్‌ సురఖ్య సంఘటన్‌ (జీఏఎస్‌ఎస్‌) ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశాయి. ఉపా చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని ఆయా సంఘాల కో`ఆర్డినేషన్‌ కమిటీ సభ్యులు వీఎస్‌ కృష్ణ, ప్రధాన కార్యదర్శి దెబా రంజన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share