Current Date: 22 Jun, 2026

నేడు హైదరాబాద్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు

నేడు హైదరాబాద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. నగరంలో నిర్వహిస్తున్న బసవతారకం ఆస్పత్రి రజతోత్సవ (సిల్వర్ జూబ్లీ) వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. క్యాన్సర్ బాధితులకు సేవలందిస్తూ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆస్పత్రి నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం అనంతరం చంద్రబాబు హైదరాబాద్‌లోనే బస చేసి, తదుపరి అధికారిక కార్యక్రమాల అనంతరం తిరుగు ప్రయాణం కానున్నారు.