నేడు ఏపీలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ : రాయలసీమ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం, ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి విస్తరించడంతో రాష్ట్రంలో మేఘావృత వాతావరణం నెలకొంది. సోమవారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.