Current Date: 27 Nov, 2024

జానీ మాస్టర్‌కి షాకిచ్చిన కోర్టు సెంటిమెంట్ తెరపైకి వచ్చినా నో బెయిల్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు కొట్టేసింది. బెయిల్ ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పింది. కేసు తీవ్రత, బాధితురాలిని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని నార్సింగి పోలీసుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. బెయిల్ పిటిషన్‌ను రద్దు చేసింది.తనపై బెంగతో ఆయన తల్లి తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. బెయిల్ ఇస్తే కనీసం తల్లిని చూసుకుంటానన్న జానీ మాస్టర్‌కు చుక్కెదురైంది. 2022కు గానూ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌ ఎంపిక కాగా.. అవార్డు అందుకునేందుకు అనుమతించాలంటూ విజ్ఞప్తి చేయగా.మూడు రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. కానీ. పోక్సో కేసు నమోదవటంతో జానీ మాస్టర్‌కు వచ్చిన అవార్డును రద్దు చేస్తూ నేషనల్ అవార్డు సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.దాంతో తనకు మరోసారి బెయిల్ మంజూరు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టులో జానీ మాస్టర్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. ఇప్పటికే నేషనల్ అవార్డు రద్దవటం తనపై బెంగతో ఆయన తల్లికి గుండెపోటు వచ్చి ఆస్పత్రిలో చేరటంతో తీవ్ర మనోవేదనతో ఉన్న జానీ మాస్టర్‌కు కోర్టు ఇచ్చిన తీర్పుతో మరో షాక్ తగిలినట్టయింది.

Share