Current Date: 02 Jul, 2024

Janasena office closed in Visakhapatnam

విశాఖలోని జనసేన పార్టీ కార్యాలయం ఖాళీ అవ్వబోతోంది. ఇప్పటికే భవన యజమాని ‘టూలెట్‌’ బోర్డు పెట్టేశారు. నెలకు రూ.65వేలు అద్దె చెల్లిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మార్చి 31వరకూ గడువున్నప్పటికీ రెండ్నెళ్ల ముందే బోర్డు పెట్టేయడంపై చర్చ జరుగుతోంది. విశాఖలోని తూర్పు నియోజకవర్గంలో కొత్త కార్యాలయాన్ని వెతుకుతున్నామని వైసీపీ నేతలు చెబుతున్నా తెరవెనుక మాత్రం ఏదో జరగబోతోందనే సంకేతాలొస్తున్నాయి. 
..
పదవుల్లేని శివశంకర్‌
..
విశాఖలో పదేళ్లగా జనసేన పార్టీని పసుపులేటి ఉషాకిరణ్‌, టి.శివశంకర్‌, బొలిశెట్టి సత్య వంటి వారు మోస్తూ వస్తున్నారు. పార్టీ బలోపేతానికి వీరంతా ఎంతో కష్టబడ్డారు. పార్టీ కష్టకాలంలో ఉందని చెబుతున్నా నెలకు రూ.65వేలు అద్దె చెల్లించాలని తీర్మానించారు. అయితే ఉన్నట్టుండీ జనసేన పార్టీ కార్యాలయాన్ని మూసేసే విషయాన్ని ఎవరూ స్పష్టంగా చెప్పలేక పోతున్నారు.. ప్రస్తుతం  ఆ పార్టీ కార్యాలయానికి శివశంకరే అద్దె చెల్లిస్తున్నట్టు తెలిసింది. పార్టీలో ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదు. నిన్నమొన్న పార్టీలో చేరిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, ఎమ్మెల్సీ వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌ బాబుకిస్తున్న ప్రాధాన్యత కూడా తమకు దక్కడం లేదని జనసేన పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నాగబాబు టూర్‌లోనూ పంచకర్ల తప్పితే శివశంకర్‌ ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన నాకెందుకొచ్చిందీభారం అనుకుంటూ పార్టీ కార్యాలయాన్ని వదిలేశారని, నగరంలోని ఈస్ట్‌ పరిధిలో ఒక కొత్త కార్యాలయాన్ని వెదుకుతున్నామని, నెల రోజుల్లోగా విశాఖ జనసేన కార్యాలయం కొత్తచోట రాబోతుందని మాత్రం నేతలు చెబుతున్నారు. ఒకే సిటీలో రెండు పార్టీ కార్యాలయాలెందుకనుకుంటూ ప్రస్తుతం మాధవధారలోని కార్యాలయాన్ని మూసివేసి నట్టు చెప్పుకుంటున్నారు.
..
ప్రారంభమైన కొట్లాటలు
..
ప్రస్తుతం విశాఖ జనసేన పార్టీ నేతలు తలోదారిలో వెళ్తున్నారు. ఎవరికి వారే బాస్‌గా చెప్పుకొంటున్నారు. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు కొన్నాళ్లగా పెందుర్తిలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తలని కాకుండా తన వర్గీయులతో కార్యక్రమాలు నడుపుతున్నారు. పెందుర్తి టికెట్‌ ను శివశంకర్‌ ఆశించినట్టు తెలుస్తోంది. అయితే ఆయన నోరు విప్పి తనకు ఈ పదవి కావాలని పవన్‌ కళ్యాణ్‌ ని అడగలేకపోయారు. ఈ సమయంలో నే పంచకర్ల జనసేన లోకి ప్రవేశించడం, జిల్లా అధ్యక్ష పదవిని చేజిక్కించు కోవడం జరిగిపోయాయి. అంతే కాకుండా పెందుర్తి కేంద్రంగా పనిచేయడం మొదలుపెట్టారు. అయితే జనసేన కార్యకర్తలనే కాకుండా తన సొంత మనుషులను పక్కన పెట్టుకున్నారు. ఇందులో కొంతమంది భూ కబ్జా కేసుల్లో జైలుకు వెళ్లిన వారు కూడా వున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. అయినా పంచకర్ల వీటిని  పక్కన పెట్టి పెందుర్తి సీటును నమ్ముకొని పనిచేస్తున్నారు.%శ్రీ%సహజంగానే అయితే అంతకు ముందు రెండేళ్ళ నుంచే శివశంకర్‌ ఈ స్థానాన్ని నమ్ముకున్నారు. అక్కడ సొంత సొమ్ముతో రెండు పార్టీ ఆఫీస్‌ లను నడుపుతున్నారు. పైగా  పవన్‌ కళ్యాణ్‌ ఆదర్శలు నచ్చి ఉన్నత మైన ఉద్యోగాన్నికూడా శివశంకర్‌ విడిచిపెట్టారు. అన్ని సేవలనూ ఉపయోగించుకున్న తరువాత శివశంకర్‌ ను పక్కన పెట్టడాన్ని ఆయన అనుయాయులు సహించలేక పోతున్నారు. ఈ జూaతీఱఅaaఎaశ్రీa్‌ష్ట్రఱ అలకబూనారని చెబుతున్నారు. తొలి నుంచీ పార్టీ జెండా మోస్తున్న తనలాంటి వాళ్లను కాదని కొత్తగా ఇటీవల పార్టీలో చేరిన వారికే పార్టీ అధిష్టానం ప్రాధాన్యతనిస్తోందని, అందుకే తనంతగా తాను హ్యాపీయేనంటూ మాధవధారలోని పార్టీ ఆఫీస్‌కు శివశంకర్‌ మంగళం పాడేశారంటున్నారు. ఈ విషయాన్ని మాత్రం జనసేన పార్టీ నేతలు గుట్టుగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.