ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనేందుకు ఆతిథ్య దేశం పాకిస్థాన్‌కు భారత్ వెళ్లడంపై ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతోంది. భద్రతా కారణాల రీత్యా టీమిండియాను పాక్ పంపించబోమని బీసీసీఐ చెబుతోంది. ఈ మేరకు భారత్ అందించిన సమాచారాన్ని ఐసీసీ ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడంపై అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ పీసీబీని ఐసీసీ కోరినట్టు సమాచారం. ఈ విషయాన్ని పీసీబీ కూడా నిర్ధారించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం నుంచి వైదొలిగే ఉద్దేశం పాకిస్థాన్‌కు లేకుంటే భారత్ మ్యాచ్‌లను యూఏఈలో, ఫైనల్ మ్యాచ్‌ను దుబాయ్ నగరంలో నిర్వహించాలనేది ఐసీసీ ప్రణాళిక అని సంబంధిత వర్గాలు సోమవారం తెలిపాయి.
Share