Current Date: 27 Nov, 2024

ఉత్తరాంధ్ర, కోస్తాకు భారీ వర్షాలు బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిరది. ఇది పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు చేరువలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. శనివారానికి వాయుగుండంగా మారే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు, దక్షిణ ఒడిశాతో పాటు తెలంగాణలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. శుక్ర, శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్ర, కోస్తాకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇక మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఆదివారం వరకు సముద్రం అలజడిగా ఉంటుందని, గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబరులో ఒకటి లేదా రెండు అల్పపీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. 

Share