అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆమదాలవలస జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో ఘనంగా యోగా డే నిర్వహించారు. యోగా ఆచార్యులు అప్పన్న దంపతుల ఆధ్వర్యంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, వారి పిల్లలు సుమారు 30మంది యోగాసనాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి ఎస్.మణి మాట్లాడుతూ యోగాతో శారీరక ధృడత్వంతో పాటు మానసిక ప్రశాంతతను పొందొచ్చన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కణితి విజయలక్ష్మి మాట్లాడుతూ యోగా పుట్టుక భారత్లోనే జరిగిందని, ఐక్యరాజ్యసమితి 10ఏళ్ల క్రితం యోగాను అంతర్జాతీయ సాధనా ప్రక్రియగా గుర్తించడం మన దేశానికి గర్వ కారణమన్నారు. యోగాతో అంతా ఆరోగ్యంగా ఉండొచ్చని పిలుపునిచ్చారు.