సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీ తప్పిదాలపై వైయస్ జగన్ సీరియస్‌గా రివ్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్లుగా గుర్తించిన జగన్.. తాడేపల్లిలో అద్దె భవనంలో నిర్వహిస్తున్న వైసీపీ కార్యాలయాన్ని మూసివేయాలని నిర్ణయించుకున్నారు.పార్టీలో ఇకపై ప్రతి కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి అనుకూలంగా తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహించబోతున్నారు. జగన్ నివాస ఆవరణంలోనే పార్టీ ఆఫీస్ కూడా ఉండనుంది. వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలను స్వయంగా జగన్‌తో పాటు వైసీపీ పెద్దలు కూడా గాలికి వదిలేశారు. ఒక్కరోజు కూడా పార్టీ కేడర్‌తో సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు. దాంతో గ్రౌండ్ రియాలిటీ ఎవరికీ తెలియకపోయింది. చివరికి ఎన్నికల్లో కూడా వైసీపీ కార్యకర్తలు అంటీముట్టనట్లు ఉండిపోయారు.ఎన్నికల ఫలితాల తర్వాత అందరికీ మబ్బులు విడిపోయాయి. ఇప్పుడు పార్టీని మళ్లీ యాక్టీవ్ చేయాల్సిన బాధ్యత జగన్‌పై పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో జగన్‌కి మరో ప్రత్యామ్నాయం, ఇంకేం పని కూడా లేదు. దాంతో జగన్ ఏ మేరకు నిర్ణయాలు తీసుకుని మళ్లీ కేడర్‌ను యాక్టివేట్ చేస్తాడో చూడాలి.