Current Date: 05 Oct, 2024

ట్రంప్‌కి తప్పిన మరో ముప్పు వెంటాడుతున్న గండాలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరో ముప్పు తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోంటానా స్టేట్‌లోని బోజ్‌మన్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొనడానికి ట్రంప్ బయల్దేరాడు. కానీ.. అతను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే అప్రమత్తమైన పైలెట్‌ అత్యవసరంగా విమానాన్ని బిల్లింగ్స్ లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు.బోజ్‌మన్ టౌన్‌కు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ ఎయిర్‌పోర్ట్. ఇక్కడ ట్రంప్ ఫ్లైట్ ల్యాండ్ అయిన విషయాన్ని ఎయిర్‌పోర్ట్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ జెన్నీ మోకెల్ నిర్ధారించారు. మొన్నటికి మొన్న హత్యాయత్నం నుంచి ట్రంప్ తృటిలో తప్పించుకున్నారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న ఆయన పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రసంగిస్తోన్న సమయంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆయన కుడి చెవికి బుల్లెట్ తగిలింది. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను ట్రంప్‌కి ప్రత్యర్థిగా ఉన్నారు.

Share