Current Date: 05 Oct, 2024

అమెజాన్‌లో ఆర్డ‌ర్‌లో పాముకంగుతిన్న బెంగ‌ళూరు జంట‌

అమెజాన్‌లో ఎక్స్‌బాక్స్ కంట్రోల‌ర్ ఆర్డ‌ర్ చేసిన బెంగ‌ళూరు సాఫ్ట్‌వేర్ జంట‌కు ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది.బెంగళూర్‌లోని స‌ర్జాపూర్ రోడ్‌లో ఉండే దంపతులు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో ఎక్స్ బాక్స్ కంట్రోలర్ ఆర్డర్ చేశారు. ఆదివారం అమెజాన్ ప్రైమ్‌లో ఆర్డర్ చేయగా.. మంగళవారం వచ్చింది. దాంతో ప్యాకేజీని ఓపెన్ చేసే స‌మ‌యంలో వీడియో తీశారు. అలా బాక్స్‌కు ఉన్న టేప్ తీసే క్రమంలో వారికి పాము క‌నిపించింది. అది విషస‌ర్పం కావడంతో భయాందోళనకు గురయ్యారు. అయితే, ఆ పాము టేపుకు అతుక్కొని ఉండడంతో ఆ జంట ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఈ విష‌యాన్ని అమెజాన్ కస్టమర్ కేర్ సపోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. తమ పరిస్థితి చెప్పినప్పటికీ రెండు గంటల పాటు వెయిట్ చేయించారని ఆ జంట మండిప‌డింది. ఆ తర్వాత ఆర్డర్‌కు సంబంధించి నగదు మొత్తం రీఫండ్ చేశారట‌.

Share