బొబ్బిలి కోటలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు బేబీ నాయన మర్యాద పూర్వకంగా కలిసి ఎంపీ అప్పలనాయుడును సన్మానించారు. బొబ్బిలి నియోజకవర్గము సంవత్సర గురించి ఇరువురు చర్చించారు. రైల్వే స్టేషన్ సమస్యలపై ఎమ్మెల్యే బేబీ నాయన క్లుప్తంగా వివరించారు. బొబ్బిలి స్టేషన్లో వందే భారత్ రైలు స్టాప్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బేబీ నాయన కోరారు. నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతున్నందున ఆ మార్గంలో ప్రయాణించే ప్రజలకు ఇబ్బంది లేకుండా రైల్వే అండర్ పాస్ ను నిర్మించాలని కోరారు. ఎంపీ అప్పలనాయుడు
సానుకూలంగా స్పందించి కేంద్ర ప్రభుత్వాం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే విధంగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. రైల్వే స్టేషన్ వద్ద వ్యాగన్ లోడింగ్ అన్లోడింగ్ గుడ్సు సెడ్ కేంద్రాన్ని ఇక్కడే కొనసాగించాలని కోరుతూ కళాసి సంఘం నాయకులు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కు వినతి పత్రం సమర్పించారు
Share