Current Date: 26 Nov, 2024

ప్రజా దర్బార్ లో ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి సంధ్యారాణి

స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించారు. అరకు పాడేరు నుంచి పార్టీ నాయకులు వంటల నాగేశ్వరరావు బొర్రా నాగరాజు నియోజకవర్గంలో గ్రామాలకు రోడ్లు మంజూరు చేయాలని కోరారు. మక్కువ మండలం చెముడు గ్రామానికి చెందిన నిరుద్యోగ మహిళలు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మంత్రి సంధ్యారాణిని కోరారు. పటంలో ఉన్న ముస్లిం సోదరులు వారి సమస్యలను తెలియజేశారు. మున్సిపాలిటీ పరిధిలో దండిగాం రోడ్డుకు ఇరువైపులు ఉన్న నివాసిత మహిళలు వారి యొక్క నీటి సమస్య గురించి మంత్రికి క్లుప్తంగా వివరించారు. మంత్రి సంధ్యారాణి క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారి సమస్యలు విని వెంటనే అధికారులకు ఫోన్ చేసి ప్రాధాన్యత క్రమంలో సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని తెలియజేశారు. 

Share