Current Date: 31 Mar, 2025

వెల‌గ‌పూడిలో ఐదు ఎక‌రాలు కొన్న సీఎం చంద్ర‌బాబు...

ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో ఇంటి స్థ‌లం కొనుగోలు చేశారు. అమ‌రావ‌తి నిర్మాణం కొలిక్కి వ‌చ్చాక సొంతిల్లు నిర్మించుకుంటాన‌ని ప‌లుమార్లు చెప్పిన చంద్ర‌బాబు.. ఇప్పుడు వెల‌గ‌పూడి రెవెన్యూ ప‌రిధిలో దాదాపు 5 ఎక‌రాల స్థ‌లం కొనుగోలు చేశారు. సుమారు 25వేల చ‌ద‌ర‌పు గ‌జాల ఈ ప్లాట్ ఈ-6 రోడ్డుకు ఆనుకుని ఉంది.  ఇది ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు రైతుల పేరిట ఉన్న రిట‌ర్న‌బుల్ ప్లాట్‌. ఇప్ప‌టికే ఆ రైతుల‌కు డబ్బులు చెల్లించిన‌ట్లు స‌మాచారం. ఇందులో కొంత స్థ‌లం ఇంటికి, మిగ‌తాది వాహ‌నాల పార్కింగ్‌, సిబ్బందికి గ‌దులు, లాన్ కోసం వినియోగించ‌నున్నారు.

Share