Current Date: 07 Oct, 2024

సెంట్రల్ జైల్లో సిబ్బందికి కనీస వసతులు లేవు

విశాఖ సెంట్రల్ జైల్లో సిబ్బందికి ఖైదీలకు కనీస వసతులు లేవని, పట్టుమని 12 ఏళ్లు నిండని చిన్నారులు గంజాయి కేసులో  ఖైదీలుగా జైలులో ఉన్నారని హోం శాఖ మంత్రి  వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు ఆమె  మంగళవారం మధ్యాహ్నం విశాఖ సెంట్రల్ జైలును సందర్శించి గంజాయి కేసులో జైలులో ఉన్న గంజాయి ఖైదీలను కలిసి ముచ్చటించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సెంట్రల్ జైల్లో కనీస వసతలు లేవని అసహనం వ్యక్తం చేశారు. సెంట్రల్ జైల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.కేంద్ర కారాగారం  800 మంది కెపాసిటీ ఉంటే 3 రెట్లు అధికంగా ఖైదిలు ఉన్నారని తెలిపారు. పెరిగిన నేరాలను బట్టి  2500 మంది ఖైదీలు జైలులో ఉన్నారన్నారు. ఇందులో  1200 మంది గంజాయి ఖైదిలు ఉన్నారని చెప్పారు. జైలు లోపల హృదయ విధారకర దృశ్యాలు చూసిచలించిపోయానని తెలిపారు. చిన్నారులు రూ.5-10 వేలకు గంజాయి అమ్ముతూ అరెస్ట్ అవ్వడం జరిగిందన్నారు. అసలు దొంగలు బయట దర్జాగా తిరుగుతున్నారని, అమాయకులు లోపల జైల్లో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో సెంట్రల్ జైల్లో గంజాయి డి-అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఆమె ప్రకటించారు. దీనిపై ఉన్నత అధికారులతో   సమీక్ష నిర్వహించి, జైలు సిబ్బంది సంక్షేమం చూస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఖైదీలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి వారి ఆరోగ్యానికి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తాం అని తెలిపారు. 

Share