తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదం కల్తీ నేపథ్యంలో హిందూ సంఘాలు అప్రమత్తం అయ్యాయి. స్వామివారి పవిత్రతను కాపాడేందుకు నడుం కట్టాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాయి. ఈ మేరకు నేడు తిరుచానూరు శిల్పారామంలో జాతీయ హిందూ ధార్మిక సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న వందలాది మంది స్వామీజీలు పాల్గొననున్నారు. ఈ సదస్సు ఉదయం నుంచీ రాత్రి వరకూ జరగనుంది. తిరుపతి క్షేత్రంలో మద్యం, మాంసం లేకుండా తిరుపతి క్షేత్రాన్ని టెంపుల్ సిటీగా మార్చాలని ఈ సమావేశంలో స్వామీజీలు డిమాండ్ చేయనున్నారు. అలాగే తిరుపతితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాల ప్రాంతాల్లో గోహత్యలు, అన్యమత ప్రచారాలు లేకుండా చట్టం చేయాలని స్వామీజీలు తీర్మానం చేసే అవకాశం ఉంది.
Share