Current Date: 18 Feb, 2026

దూడ మృతదేహం వద్దకు జనాన్ని తీసుకెళ్లిన ఆవు.. కన్నపేగు మమకారం

కుమురం భీం జిల్లా సిర్పూర్(టి) మండలంలో ఒక హృదయ విద్యావక ఘటన చోటుచేసుకుంది. ఇటిక్యాలపహాడ్ గ్రామానికి చెందిన భీంరావు అనే వ్యక్తికి చెందిన ఆవు, దూడ మేత కోసం అడవికి వెళ్లాయి. అయితే సాయంత్రం ఆవు ఒక్కటే కన్నీరు కారుస్తూ ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చింది. తన దూడకు ఏదో ఆపద జరిగిందని ఆ మూగజీవి యజమానికి సంకేతాలిచ్చింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు మరుసటి రోజు ఉదయం గ్రామానికి చేరుకున్నారు. యజమాని ఆవును వదిలిపెట్టగా, అది వారిని నేరుగా అడవిలోకి తీసుకెళ్లింది. సుమారు ఒక కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత, ఒక చోట ఆవు ఆగిపోయింది. అక్కడ వెతకగా తన దూడ మృతదేహం అధికారులకు కనిపించింది. పులి దాడి చేయడంతోనే దూడ మరణించినట్లు అటవీ సిబ్బంది నిర్ధారించారు. తన బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్నా, ఆ ప్రదేశానికి అధికారులను తీసుకెళ్లిన ఆవు మమకారాన్ని చూసి స్థానికులు,అధికారులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన అక్కడి వారిని ఎంతగానో కలిచివేసింది.