Current Date: 18 Feb, 2026

ప్రియుడి కోసం భార్య మృతి నాటకం.. దొరికిపోయింది ఇలా!

కర్ణాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన ప్రియాంక అనే మహిళ, తన భర్తను వదిలి ప్రియుడితో వెళ్ళిపోవడానికి దారుణమైన ప్లాన్ వేసింది. రెండేళ్ల క్రితం వివాహమైన ఈమె, తన స్నేహితురాలి పెళ్లికి వెళ్తానని చెప్పి హాసన్ జిల్లాలోని ఒక గ్రామానికి వెళ్ళింది. అక్కడ అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉండగా, ఎవరికీ తెలియకుండా ఒక కాలువ గట్టు వద్ద తన బట్టలు, చెప్పులు వదిలేసి అక్కడి నుండి పరారైంది. తమ భార్య కాలువలో పడి మరణించి ఉంటుందని భర్త భావించేలా ఆమె ఈ నాటకం ఆడింది. భార్య కనిపించడం లేదని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆమె ఒంటిపై ఉన్న 30 లక్షల విలువైన నగలు కొట్టేయడానికే ఎవరైనా ఆమెను హత్య చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చివరకు పోలీసులు బేలూరు బస్టాండ్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ప్రియాంక సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె తన ప్రియుడు డేవిడ్‌తో కలిసి ఉన్నట్లు తెలుసుకుని, ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు