Current Date: 06 Oct, 2024

సీఎం చంద్రబాబు జీతం రేవంత్ రెడ్డి కంటే తక్కువే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారి సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశాక.. చాలా మంది ఆయన జీతభత్యాల గురించి గూగుల్‌లో ఆరాతీస్తున్నారు. మన దేశంలోని ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రీతిలో ఆర్థిక స్థితిగతులు ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక స్థితిని బట్టి సీఎం పదవిలో ఉండే వారికి గౌరవ వేతనం, అదనపు భత్యాలు అందుతుంటాయి.గౌరవ వేతనాన్ని నిర్ణయించుకునే అధికారం సీఎంకు ఉంటుంది. అందువల్లే సీఎంగా తాను ప్రతినెలా  రూ.3,35,000 వేతనాన్ని తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇక అదనంగా చాలా సౌకర్యాలు ఆయనకు ప్రభుత్వం తరఫున లభిస్తుంటాయి. భద్రతా ఏర్పాట్లు, విదేశీ పర్యటనల ఖర్చులన్నీ ప్రభుత్వానివే. దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సొంతంగా విమానాలు, హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. వాటిని సీఎంలు, గవర్నర్ ఎప్పుడైనా వాడుకోవచ్చు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దేశంలోనే అత్యధికంగా ప్రతినెలా రూ.4.10 లక్షల వేతనం అందుతోందని తెలుస్తోంది. ఇక ఇటీవల ప్రమాణం చేసిన ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ ప్రతినెలా రూ.1.60 లక్షల వేతనాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి నెలవారీ వేతనం ప్రస్తుతం రూ.1.05 లక్షలే ఉంది.

Share