Current Date: 26 Nov, 2024

టీ20ల్లో ఆల్‌టైమ్ రికార్డ్ 27 బంతుల్లోనే 100

టీ20 క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదైంది. సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్టోనియా ఆటగాడు సాహిల్‌ చౌహాన్ కేవలం‌ 27 బంతుల్లోనే 100 పరుగులు చేసేశాడు. పురుషులు, మహిళలు, అంతర్జాతీయ  స్థాయి.. ఇలా ఏ విభాగంలో చూసినా ఇదే వేగవంతమైన సెంచరీ.ఇంటర్నేషనల్ టీ20ల్లో నమీబియా ఆటగాడు జాన్‌ నికోల్‌ లాప్టీ ఈటన్‌ 33 బంతుల్లో 100 పరుగులతో నమోదు చేసిన ఫాస్టెస్ట్‌ సెంచరీని సాహిల్‌ చౌహాన్‌ కేవలం నాలుగు నెలల్లో బద్దలు కొట్టాడు. సాహిల్‌కు ముందు ఈ రికార్డు విండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌ పేరిట ఉండేది. గేల్‌ 2013 ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ తరఫున ఆడుతూ పూణే వారియర్స్‌పై 30 బంతుల్లో శతక్కొట్టాడు.ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న సాహిల్‌ 144 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 18 సిక్సర్లు ఉన్నాయి. పురుషుల అంతర్జాతీయ టీ20ల్లో ఓ బ్యాటర్‌ సాధించిన అత్యధిక సిక్సర్లు ఇవే. సాహిల్‌ సునామీ శతకంతో విరుచుకుపడటంతో సైప్రస్‌పై ఎస్టోనియా ఘన విజయం సాధించింది.

Share