"తప్పు ఒప్పుకుంటున్నాను. వీళ్లందరితో కలిసి 'కోర్టు' సినిమాని తీసి నేరం చేసింది నేనే. కావాలంటే అరెస్ట్ చేసుకోండి’’ అని నేచురల్ స్టార్ నాని ప్రకటించాడు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఏ నోబడీ' సినిమా మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా రిలీజ్‌కానుంది.ఈ మూవీ ప్రెస్ మీట్‌కి నాని చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కోర్టు బోనులో నిల్చొని హీరో నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "నాలోని కాన్ఫిడెన్స్ చూసి మీరే డిసైడ్ అవ్వండి. మార్చి 14న మీరు ఎంత మంచి సినిమా చూడబోతున్నారో. ఈ సినిమా చూశాను. ఇందులో ఎవరు హీరో అని చెప్పడం కష్టం. ఈ కథ చాలా సెన్సిటివ్ మేటర్. చాలా జాగ్రత్తలు తీసుకొని చేశాం. జగదీశ్ చాలా రీసెర్చ్ చేశారు. సినిమా పూర్తయినప్పటికీ నిలబడి క్లాప్స్ కొడతారు. ఇది నా గ్యారెంటీ" అని హీరో నాని అన్నాడు."కోర్ట్ మూవీ గ్రేట్ ఐడియా, బ్యూటీఫుల్ లవ్ స్టొరీ. చాలా గ్రిప్పింగ్ డ్రామా. మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్. ఇది అద్భుతమైన కోర్ట్ రూమ్ డ్రామా. గ్రేట్ మెసేజ్ ఉంటుంది. ఆడియన్స్ సెలబ్రేట్ చేసుకునే సినిమా అవుతుందని నాని పేర్కొన్నాడు.