Current Date: 27 Sep, 2024

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య మాజీ భార్య ప్రియుడితో చక్కర్లు

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌ తన ప్రియుడితో కలిసి ముంబయిలో చక్కర్లు కొడుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న హార్దిక్ పాండ్యా,నటాషా స్టాంకోవిచ్‌లు మూడేళ్లలోనే విడిపోయి.. ఇటీవల విడాకులు కూడా తీసుకున్న విషయం తెలిసిందే.విడాకులు అనంతరం నటాషా తన కుమారుడు అగస్త్యను తీసుకుని తన సొంత దేశం సెర్బియాకు వెళ్లిపోయారు.అయితే ఇటీవలే తిరిగి ఇండియాకు వచ్చిన నటాషా.. ముంబై విధుల్లో తిరుగుతూ కనిపించారు. ఆమెతోపాటు బాయ్‌ఫ్రెండ్‌ అలెక్సాండర్‌ ఇలాక్‌ కూడా ఉంటున్నాడు. వాస్తవానికి హార్దిక్‌ పాండ్యాతో గొడవలు మొదలయ్యే సమయానికే అలెగ్జాండర్ అలెక్సిలిక్‌‌తో రిలేషన్‌ను మెయిన్‌టైన్ చేస్తోందని పుకార్లు వచ్చాయి.మరోవైపు హార్దిక్ పాండ్య కూడా స్టార్ హీరోయిన్ అనన్య పాండేతో డేటింగ్‌లో ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఆ తర్వాత బ్రిటన్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియాతో హార్దిక్ పాండ్యా రిలేషన్‌లో ఉన్నారని పుకార్లు కూడా వస్తున్నాయి. ఈ మేరకు కొన్ని ఫొటోలు కూడా బయటికి వచ్చాయి.

Share