ఆస్ట్రేలియాలోని పెర్త్ టెస్టులో భారత్ బ్యాటర్లు విఫలమైన చోట... బౌలర్లు సత్తా చాటడంతో మెరుగైన స్థితిలో నిలిచింది. పేసర్లకు స్వర్గధామం లాంటి పిచ్‌పై ఇరు జట్ల బౌలర్లు విజృంభించడంతో తొలి రోజే 17 వికెట్లు నేలకూలాయి. ఆస్టేలియా గడ్డపై గత ఏడు దశాబ్దాల్లో ఒక టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు 17 వికెట్లు పడటం ఇదే తొలిసారి.మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 49.4 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్రాకి చెందిన ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం టెస్టులో 59 బంతుల్లో 41 పరుగులు చేశాడు. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఆస్ట్రేలియాలో ఆడుతున్నా.. విరాట్ కోహ్లీ లాంటి బ్యాటర్లు విఫలమైన చోట టాప్ స్కోరర్‌గా ఈ వైజాగ్ క్రికెటర్ నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్ 4 వికెట్లు పడగొట్టాడు.