ఫొటోలు తీయడం..చలాన్లు విధించడం..వాహనాలు పట్టుకోవడం..ఫైన్లు వేయడం ఇప్పుడిదే ట్రాఫిక్ పోలీసులు డ్యూటీ అయిపోయింది. ట్రాఫిక్ నియంత్రణను మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా జనాలకు తిప్పలు తప్పడం లేదు. విశాఖలోని ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు అట్టర్ ఫైయిల్యూరయ్యారు అనడానికి తాజా ఉదాహరణ సింహాచలం గిరి ప్రదక్షిణ పండుగ. గిరి ప్రదక్షిణ మొదలైన గంటకే ట్రాఫిక్ జామ్ అయి గంటల కొద్ది వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడిరది.
Share