కట్టుకున్న భర్తను కోపంలో హిజ్రా అంటూ భార్య తిట్టడాన్ని సీరియస్‌గా పరిగణిస్తూ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. 2017లో జంట వివాహం చేసుకోగా.. పోర్న్ వెబ్‌సైట్‌లకి బానిసైన భార్య తరచూ భర్తని లైంగికంగా బలహీనంగా ఉన్నావంటూ తిడుతూ హిజ్రా అంటూ ఎగతాళి చేసేది.భార్య హింసని భరించలేకపోయిన భర్త విడాకుల కోసం పంజాబ్-హరియాణా హైకోర్టుని ఆశ్రయించగా.. భార్య తీరుని తీవ్రంగా పరిగణిస్తూ భర్తకి అనుకూలంగా తీర్పునిచ్చింది. కానీ.. తాను పోర్న్ సైట్‌లు చూసేదాన్ని అని చెప్పడానికి భర్త వద్ద ఎలాంటి ఆధారాలు లేవని భార్య వాదించే ప్రయత్నం చేసింది. కానీ.. భర్తని హిజ్రా అని తిట్టడం, అత్తని పనికిరాని కొడుకుని కన్నావని దూషించడం మానసిక హింస కిందకే వస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది.వివాహం తర్వాత ఏడాదిలో వారి కాపురంలో చీలిక వచ్చింది. దాంతో ఇప్పుడు కాపురాన్ని మళ్లీ బాగుచేయడం కష్టమేనని చెప్పుకొచ్చిన హైకోర్టు విడాకుల ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటికే వారికి కింది స్థాయి కోర్టులు విడాకులు మంజూరు చేసినా.. భార్య ససేమేరా అనడంతో భర్త హైకోర్టుని ఆశ్రయించారు. దాంతో హైకోర్టు కూడా కింది స్థాయి కోర్టుల తీర్పుని సమర్థిస్తూ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది.