Drinking in winter..? Do You know what happend..! |#todaynews #healthtips #drinking #drinkinguses #drinkingalcohol #alchohol #viralvideo #viralnews #viralpost #LeaderTeluguNews #Leader #TeluguNews #LeaderWorldNews #leaderworldnews #leadernews
వింటర్‌లో డ్రింకింగ్... డేంజరంటున్న ఎక్స్‌ఫర్ట్స్
చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచేందుకు మద్యాన్ని కొందరు సేవిస్తారు.. అలా తాగడం వల్ల ఒంట్లో వేడి పెరగడం ఏమో గానీ.. అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎక్కువగా తాగితే గుండె జబ్బుల బారిన పడే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ చలికాలంలో ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలోని అంతర్గత ఉష్ణోగ్రత మరింతగా పడిపోవడం వల్ల రక్తనాళాలు సంకోచించడం, కుంచించుకుపోవడం వల్ల రక్తప్రసరణ పెరిగి బీపీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆల్కహాల్ కారణంగా చలికి రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. అప్పుడు గుండెకు ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు..
మద్యపానం శరీరాన్ని వేడి చేస్తుందని ప్రజలు నమ్ముతారు. అందుకే ప్రజలు శీతాకాలంలో ఎక్కువ మద్యం తీసుకోవడం ప్రారంభిస్తారు. అయితే ఆల్కహాల్ కొంత సమయం పాటు శరీరాన్ని వెచ్చగా ఉంచినా, ఆ తర్వాత ఒక్కసారిగా శరీరం చల్లబడిపోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి.