Current Date: 28 Nov, 2024

మహారాష్ట్ర సీఎం కుర్చీలాట.. ఓడలు బళ్లు... బళ్లు ఓడలు

మ‌హారాష్ట్ర సీఎం ఎవ‌ర‌నే అంశం గురించి ఎన్నిక‌ల త‌ర్వాత మ‌హాయుతి కూట‌మిలో క్లారిటీ వచ్చేసింది.ప్ర‌ధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఎవ‌రి పేరు చెప్పినా సీఎంగా వారికి త‌న మ‌ద్ద‌తు ఉంటుందంటూ శివ‌సేన ప‌క్షనేత షిండే ప్ర‌క‌టించ‌డంతో.. ఆయన బెట్టు వీడిన‌ట్టుగా స్ప‌ష్టం అయ్యింది. వాస్తవానికి ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన వెంట‌నే షిండే కాస్త స‌న్నాయి నొక్కులు నొక్కే ప్ర‌య‌త్నం చేశారు.మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకే సీఎం సీటు ద‌క్కాల‌ని ఏమీ లేద‌నే వ్యాఖ్య ఆయ‌న నుంచి వినిపించింది. శివ‌సేన చీలిక ప‌క్షం ఎమ్మెల్యేల‌తో బీజేపీతో జ‌త క‌ట్టి సీఎం హోదాను ద‌క్కించుకున్న షిండే , ఎన్నిక‌ల త‌ర్వాత కూడా త‌నే సీఎం అనే ప్ర‌య‌త్నం కాస్త చేశారు. గ‌తంలో త‌న‌ను సీఎంగా చేసిన బీజేపీ ఆ హోదాలో త‌న‌నే కొన‌సాగిస్తుంద‌నే ఆశ‌లు ఆయ‌న‌కు ఎక్క‌డో ఉన్న‌ట్టున్నాయి. అయితే మోడీ, షాల‌తో మాట్లాడిన త‌ర్వాత పూర్తి క్లారిటీ వ‌చ్చిన‌ట్టుగా ఉంది. దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ మ‌హారాష్ట్ర మ‌హాయుతి కూట‌మి లెజిస్లేటివ్ లీడ‌ర్ గా ఎన్నుకోవ‌డం లాంఛ‌నంగా క‌నిపిస్తూ ఉంది. మొన్న‌టి వ‌ర‌కూ షిండేకు డిప్యూటీ ఫ‌డ్న‌వీస్. అంత‌కు ముందు ఈయ‌న సీఎం హోదాలో ప‌ని చేశారు. 

Share