బిగ్బాస్ గంగవ్వ చిక్కుల్లో పడ్డారు. జగిత్యాలలో ఆమెపై కేసు నమోదైంది. యూట్యూబ్ ఛానల్ ‘మై విలేజ్ షో’ కోసం గంగవ్వ చేసిన ఓ వీడియోలో రామచిలుకను ఉపయోగించడం ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టింది. 2022 మేలో తీసిన ఆ వీడియోలో ఒక రామచిలుకను ఉపయోగించడంపై ఫిర్యాదు అందడంతో జగిత్యాల ఎఫ్ఆర్వో కేసు నమోదు చేశారు.గంగవ్వతో పాటు యూట్యూబర్ రాజుపై కూడా అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాల కింద ఈ కేసు నమోదు చేసినట్లు జగిత్యాల ఎఫ్ఆర్వో పద్మారావు తెలిపారు. యూట్యూబ్లో వ్యూస్ కోసం రామచిలుకను హింసించి, వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని గౌతమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో యూట్యూబర్ రాజు రూ. 25 వేలు జరిమానా చెల్లించారు.యూట్యూబ్ ఛానల్ వీడియో కోసం చిలుకను ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జంతు సంరక్షణ కార్యకర్త గౌతమ్.. జగిత్యాల జిల్లా ఫారెస్ట్ అధికారికి అక్టోబర్ 6న లేఖ రాశారు. 2022 మే 20న ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో రామచిలుకను ఉపయోగించారని గౌతమ్ ఆరోపించారు.
Share