Current Date: 04 Jul, 2024

Sai Pallavi rej-ect-s fairness cream ad deal worth Rs 2 crore?

హీరోయిన్‌ సాయిపల్లవి చాలా డిఫరెంట్.  తొలి చిత్రంతోనే విజయంతో పాటు ప్రశంసలు అందుకున్న  సాయిపల్లవి.. తెలుగుతో పాటు మలయాళం, తమిళం భాషల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. మొదటి నుంచి గ్లామర్‌కు దూరంగా ఉంటడం. సహజత్వానికి ప్రాధాన్యత నివ్వడం. నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటించాలనుకోవడం వంటి విషయాల్లో సాయి పల్లవి చాలా క్లియర్‌గా ఉంటారు.

సినిమాలో తన పాత్ర అవకాశం లేకపోతే నిక్కచ్చిగా నిరాకరించేస్తుంది సాయిపల్లవి. అది ఎంత పెద్ద స్టార్‌ నటుడి చిత్రం అయినా సరే.  అలాంటి సాయిపల్లవికి ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనలో నటించే అవకాశం వచ్చిందట. అందులో నటించడానికి రూ. 2 కోట్లు పారితోషకం ఇవ్వడానికి ఆ సంస్థ అధినేత ముందుకు రాగా సాయిపల్లవి ఆ అవకాశాన్ని వదులుకున్నారని సమాచారం. కారణం అది బ్యూటీకి చెందిన ప్రకటన కావడమేనట.

సౌందర్య వస్తువులతో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలుగుతాదన్న ఒక్క కారణంగా అంత పారితోషాకిన్ని చెల్లిస్తానన్నా సాయిపల్లవి నో చెప్పారనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.  గతంలో కూడా ఆమెకు ఇలాంటి ఆఫర్లే వచ్చాయి. అప్పుడు కూడా ఆమె సున్నితంగా వద్దని చెప్పారు.  సౌందర్య సాధనాలకి సంబంధించి యాడ్‌లో నటించనని గతంలో చెప్పిన సాయి పల్లవి.. ఇప్పటికీ మేకప్ లేకుండానే నటిస్తున్న విషయం తెలిసిందే. మొత్తంగా.. ఇచ్చిన మాటకి కట్టుబడి సాయి పల్లవి రూ.2 కోట్లని వదులుకుంది