Current Date: 27 Nov, 2024

డయేరియా మృతుల కుటుంబాలకు పవన్‌ ఆర్థిక సాయం

 విజయనగరం జిల్లాలో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. నెల్లిమర్ల మండలం ఎస్‌.ఎస్‌.ఆర్‌.పేట వద్ద గుర్ల తాగునీటి పథకాన్ని ఆయన పరిశీలించారు. గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను పరామర్శించారు. ఆ గ్రామస్థులతో ముఖాముఖి మాట్లాడారు. అతిసారం వ్యాప్తి కారణాలపై కలెక్టర్‌తో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విచారణ తర్వాత ప్రభుత్వం నుంచి పరిహారం ప్రకటిస్తామన్న ఆయన.. వ్యక్తిగతంగా మృతుల కుటుంబాలకు రూ. 1లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు.

Share