Current Date: 05 Oct, 2024

విశాఖలో ఒక్కసారిగా వెనక్కి వెళ్లిన సముద్రం

విశాఖలో సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది. ఒక్కసారిగా సముద్రం వెనక్కి వెళ్లడంతో ఆర్కే బీచ్ వద్ద రాళ్లు బయటపడ్డాయి. విశాఖ బీచ్ లో ఏ చిన్నపాటి మార్పు జరిగినా ప్రజలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే విశాఖ వాసులు నిత్యం ఏదో ఒక సమయంలో బీచ్ ని సందర్శించి వెళ్లనిదే రోజు గడవదు. నగరంలో ఉన్న యువత, మహిళలు, పిల్లలు పెద్దలు అందరూ కుటుంబాలుగా వచ్చి బీచ్ లోనే ఆడి పాడి వెళ్తారు. విశాఖ బీచ్ కి వచ్చిన జనం ఇంత భారీ స్థాయిలో సముద్రం ఎందుకు వెనక్కి పోయిందా అని ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. సముద్రం వెన్నక్కి వెళ్ళడం తో ఆర్కే బేచ్ వద్ద బయటపడ్డ రాళ్లు సెల్ఫీ పాయింట్ గా మారాయి. పెద్ద ఎత్తున యువకులు పర్యాటకులు వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.

Share