Current Date: 31 Mar, 2025

అల్లు అర్జున్ లాయర్ తెలివి.. ఒకే ఒక లాజిక్ పాయింట్‌తో బెయిల్

అల్లు అర్జున్ కేసు విషయంలో లాయర్ నిరంజన్ రెడ్డి కోర్టులో వినిపించిన వాదనలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆయన క్వాష్ పిటిషన్‌ ద్వారా అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ వచ్చేలా చేశారు. షారుక్ నటించిన ఓ సినిమా విడుదల టైమ్ లో కూడా ఓ అభిమాని మరణించారని, అయితే ఆ వ్యక్తి మరణానికి షారుక్ కి ఎలాంటి సంబంధం లేదని కోర్టు తేల్చింది. షారుక్ ఉద్దేశపూర్వకంగా చేయలేదని గుర్తించిన గుజరాత్ కోర్టు క్లీన్ చీట్ ఇచ్చిందనే విషయాన్ని నిరంజన్ రెడ్డి తెరపైకి తెచ్చారు.పుష్ప-2 రిలీజ్ టైమ్ లో కూడా ఇదే జరిగిందని అన్నారు. దీంతో జడ్జ్ సైతం అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దాంతో.. ఒకరోజు కస్టడీ తీసుకుంటే సరిపోయేదానికి , అరెస్ట్ చేసే వరకు ఎందుకు వెళ్లారని పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో అల్లు అర్జున్‌ ను మధ్యంతర బెయిల్‌ మంజూరైంది.నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి ఈ లాయర్‌ను అల్లు అర్జున్ కోసం రంగంలో దించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నిరంజన్ రెడ్డి వైసీసీ రాజ్యసభ ఎంపీ కూడా.  నిరంజన్ రెడ్డి గతంలో కొన్ని సినిమాలకి కూడా ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. గగనం, క్షణం, ఘాజి, వైల్డ్ డాగ్, ఆచార్య వంటి సినిమాలకి ప్రొడ్యూసర్‌గా చేశారు. వైయస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తులు వంటి హైప్రొఫైల్ కేసులను సుప్రీంకోర్టులో డీల్ చేశారు. గంటకి రూ.5 లక్షల వరకూ నిరంజన్ రెడ్డి ఫీజును వసూలు చేస్తారట.

Share