Current Date: 06 Oct, 2024

విశాఖ కార్పొరేటర్లకు జగన్ నుంచి పిలుపు

జీవీఎంసీలోని స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో విశాఖ కార్పొరేటర్లకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపందింది. ఆగస్టు 7న జరగనున్న స్థాయీ సంఘం ఎన్నికల నేపథ్యంలో కార్పొరేటర్లకు దిశా నిర్దేశం చేసేందుకే జగన్ పిలిచారన్న ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు నగరంలోని స్వర్ణభారతి స్టేడియం నుంచి రెండు బస్సుల్లో సుమారు 40మంది కార్పొరేటర్లు తాడేపల్లిలోని జగన్ నివాసానికి బుధవారం సాయంత్రం బయల్దేరనున్నట్టు తెలిసింది. గురువారం ఉదయం జగన్ వారందరితో సమావేశం కానున్నారు. వాస్తవానికి మూడేళ్లగా వైసీపీ కార్పొరేటర్లే స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికవుతూ వచ్చారు. కూటమి పార్టీలు ఎన్నికల్లో విజయ దుందుభి మోగించడంతో ఈ సారి ఫలితాలు తారుమారు కానున్నాయి. వైసీపీ తరఫున 58మంది కార్పొరేటర్లగా ఎన్నికయ్యారు. అయితే వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ఏడుగురు కార్పొరేటర్లు టీడీపీలో చేరగా, మరో ఐదుగురు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి కూడా స్టాండింగ్ కమిటీ చేజారిపోకుండా జగన్ యోచిస్తున్నారు. 

Share