బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా సోమవారం సాయంత్రం 5.30 గంటలకు భారత్‌కు చేరుకున్నారు. ఆ దేశంలోని ప్రస్తుత పరిస్థితుల్లో పదవికి రాజీనామా చేసిన ఆమె సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలని భావించారు. ఈ క్రమంలో సాయంత్రం భారత్‌కు వచ్చారు. ఇక్కడి నుంచి ఆమె నేరుగా లండన్ వెళ్లనున్నారు.షేక్ హసీనా విమానాన్ని అనుసరించిన వాయుసేన ఫైటర్ జెట్స్షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు చెందిన సీ-130 విమానం భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే భారత వైమానిక దళం యుద్ధ విమానాలు గాల్లోకి ఎగిరాయి. కొద్దిసేపు సీ-130 విమానాన్ని భారత ఫైటర్స్ జెట్స్ అనుసరించాయి. ఈ సీ-130 విమానంలో షేక్ హసీనా భారత్ చేరుకున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత వాయుసేన, సైన్యం ముందే సిద్ధమైనట్లుగా విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.భారత్ దౌత్య కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టంబంగ్లాదేశ్లోని హింసాత్మక ఘటనల దృష్ట్యా ఆ దేశంలోని భారత దౌత్య కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అదే సమయంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయం వద్ద కూడా భద్రతను పెంచారు.
Share