Current Date: 26 Nov, 2024

అక్కినేని ఇంట మోగబోతున్న పెళ్లి భాజాలు కాబోయే కోడలు హింట్

అక్కినేని ఇంట త్వరలోనే మళ్లీ పెళ్లి భాజాలు మోగనున్నాయి. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల  ఇటీవల నిశ్చితార్థం చేసుకోగా.. ఈ జంట త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. పెళ్లి పనులు మొదలైనట్లు శోభిత ఇన్‌స్టాలో సంకేతాలిచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 8న హైదరాబాద్‌లో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.వివాహం ఈనెలలోనే ఉంటుందా? లేదంటే నవంబర్‌, డిసెంబర్‌లోనా అని కామెంట్ల రూపంలో శోభితాని నెటిజన్లు అడుగుతున్నారు. సమంతతో మూడేళ్ల క్రితం నాగచైతన్య విడాకులు తీసుకోగా.. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. దాంతో వీరి పెళ్లి వేడుక కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.డిసెంబర్‌ మొదటి వారంలో పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. గ్రాండ్ వెడ్డింగ్ కోసం రాజస్థాన్‌లోని ప్యాలెస్‌ని ఎంపిక చేసినట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఎంగేజ్‌మెంట్‌ గురించి ఆఖరి వరకూ గోప్యంగా ఉంచి చైతు, శోభిత.. పెళ్లి విషయం అయినా ముందుగా అభిమానులకి చెప్తారేమో చూడాలి.

Share