Current Date: 27 Nov, 2024

బెంగళూరు టెస్టులో ఎదురీదుతున్న భారత్, కోహ్లీ, రోహిత్ ఔట్

బెంగళూరు వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ రసవత్తరంగా సాగుతుంది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. మూడో రోజు చివరి బంతికి విరాట్‌ కోహ్లి  70 పరుగులతో ఔటయ్యాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ 70 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు భారత్‌ ఇంకా 125 పరుగులు వెనుకపడి ఉంది. భారత్‌ చేతిలో మరో ఏడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా రెండు రోజు ఆట మిగిలి ఉంది. భారత సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో అజాజ్‌ పటేల్‌ 2, గ్లెన్‌ ఫిలిప్స్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 402 పరుగులకు ఆలౌటైంది. రచిన్‌ రవీంద్ర సెంచరీతో, డెవాన్‌ కాన్వే, టిమ్‌ సౌథీ అర్ద సెంచరీలతో సత్తా చాటారు. భారత బౌలర్లలో కుల్దీప్‌, జడేజా తలో మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌ రెండు, అశ్విన్‌, బుమ్రా చెరో వికెట్‌ దక్కించుకున్నారు. భారత్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలవాలంటే 7 వికెట్ల సాయంతో కనీసం మరో 250 పరుగులైనా చేయాలి.

Share