విజయవాడలో వరద బాధితుడిపై వీఆర్వో దాడి చేసిన ఘటన కలకలంరేపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులతో గౌరవంగా, మర్యాదగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో సూచించారు. కానీ ఓ మహిళా వీఆర్వో మాత్రం దురుసుగా ప్రవర్తించారుఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని 58వ డివిజన్ షాదీఖానా దగ్గర.. ఉదయం వరద బాధితులకు ఇంటి దగ్గరే అధికారులు వచ్చి పోలీసుల సమక్షంలో నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నారు. స్థానిక వీఆర్వో విజయలక్ష్మి ఈ పంపిణీని పర్యవేక్షించారు.. తమ వీధిలో వరదలు వచ్చినప్పటి నుంచి ఆహారం, మంచినీరు అందలేదని కొందరు వరద బాధితులు ప్రశ్నించారు. ఈ క్రమంలో మహిళా వీఆర్వో, వరద బాధితుల మధ్య వాగ్వాదం జరిగింది పోలీసులు ఉండగానే వరద బాధితులను దుర్భాషలాడుతూ యాసిన్ అనే యువకుడి వీఆర్వో చెంపపై కొట్టారు. సహాయక చర్యల్లో నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించినట్లు ఫిర్యాదు అందడంతో వీఆర్వో విజయలక్ష్మికి కలెక్టర్ సృజన షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ ఘటనపై రెండు రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు.
Share