Current Date: 26 Nov, 2024

తిరుమల లడ్డు వివాదం కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ

తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం  కీలక నిర్ణయం తీసుకుంది. నెయ్యిని తమ వద్దే పరీక్షించేలా ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. తాజా వివాదం నేపథ్యంలో ప్రముఖ సంస్థ సరఫరా చేసిన నెయ్యిని ఇటీవల నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు. సెంటర్ ఫర్ అనలసిస్ అండ్ లెర్నింగ్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ ల్యాబ్‌కు పంపింది. ఈ సందర్భంగా వారితో ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. నెయ్యిలో నాణ్యతను పరీక్షించే రూ. 75 లక్షల విలువైన పరికరాలు ఇచ్చేందుకు ఎన్‌డీడీబీ సిద్ధమైంది. వీటిని దిగుమతి చేసుకున్న అనంతరం టీటీడీ ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు. ఈ ఏడాది డిసెంబర్‌లోపు తిరుమలలో ల్యాబ్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.

Share