రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారుతుందని పేర్కొంది.దీని ప్రభావంతో ప.బెంగాల్, ఒడిశా, ఛత్తీస్ గఢ్, బిహార్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయంది.APపై ప్రభావం స్వల్పంగానే ఉన్నా రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అటు ఈ నెల 20 నుంచి అక్టోబర్ మొదటివారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.