Current Date: 27 Nov, 2024

రుషికొండ భవనాలను ఏం చేస్తారు? ప్రజల్లో పెరుగుతున్న ఉత్కంఠ

గత ప్రభుత్వం హయాంలో రూ.500 కోట్లతో నిర్మించిన ఈ విలాసవంతమైన భవనాలను ఏం చేస్తారు? అనేది అటు ప్రజల్లోనూ ఇటు అధికారులు, మంత్రుల్లోనూ ఉత్కంఠ నెలకొని ఉంది. వీటిని డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది. అలాగే హోటల్ చేయాలని, సినీ పరిశ్రమకు ఇవ్వాలని కూడా ప్రతిపాదనలు వచ్చాయి. అదే సమయంలో ఐటీ పరిశ్రమకు కేటాయించాలనే ప్రతిపాదన కూడా వినిపించింది. ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంత ఖరీదైన భవనాలను ఏం చేస్తారు? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది అప్పటి నుంచి ఉత్కంఠగా మారింది. ఈ పరిస్థితుల్లో రుషికొండ ప్యాలెస్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించడంతో.. త్వరలోనే దీనిపై కూటమి సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంటుందనే చర్చ జోరుగా నడుస్తోంది.

Share