Current Date: 26 Nov, 2024

ప్రియాంకగాంధీ నామినేషన్‌ దాఖలు.. తొలిసారి ఎన్నికల బరిలోకి

 కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ తొలిసారి ఎన్నికల రణరంగంలోకి దూకారు. కేరళలోని వయనాడ్‌కు జరగనున్న ఉప ఎన్నికల బరిలోకి దిగిన ఆమె బుధవారం మధ్యాహ్నం  నామినేషన్‌ దాఖలు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన రాహుల్‌గాంధీ వయనాడ్‌ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. నామినేషన్‌ దాఖలుకు ముందు సోదరుడు రాహుల్‌గాంధీతో కలిసి ప్రియాంక రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, పార్టీ సీనియర్‌ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Share