ఇటీవల తిరుమలలో దువ్వాడ జంట చేపట్టిన విన్యాసం మరో ఇంట్రస్టింగ్ మలుపు తీసుకుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో ఫొటోషూట్ చేయడంపై టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. భక్తుల మనోభావాలను దువ్వాడ, మాధురి దెబ్బతీశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు విజిలెన్స్ అధికారులు. దీంతో ఈనెల 10 వ తేదీన కేసు ఫైల్ చేసిన పోలీసులు.. దువ్వాడ శ్రీను, మాధురి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఆలయం వద్ద భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా మాధురి, శ్రీను ప్రవర్తించారనేదాని పై ఇప్పుడు విచారణ జరుగుతోంది. తిరుపతి నుంచి ఒక పోలీస్ టీమ్‌ను శ్రీకాకుళం జిల్లా టెక్కలికి పంపారు. దివ్వల మాధురికి నేరుగా 41 నోటీసులు అందించబోతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో వ్యక్తిగత విషయాలు మాట్లాడినందుకు, రీల్స్ చేసినందుకు, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినందుకు వివరణ ఇవ్వాలని కోరనున్నారు.