Current Date: 25 Aug, 2026

లారీ డ్రైవర్ పై రవాణా శాఖ బ్రేక్ ఇన్స్పెక్టర్ డ్రైవర్ పిడి గుద్దులు

 విశాఖలోని జ్ఞానాపురం లారీ యార్డ్  దగ్గర  లారీ డ్రైవర్ వాహనం నిలుపలేదని  డ్రైవర్ ని  బ్రేక్ ఇన్స్పెక్టర్ పార్వతి కారు డ్రైవర్ చిదక బాదిన సంఘటన హల్ చల్ అవుతోంది. ఇన్స్పెక్టర్ పార్వతి సమక్షంలోనే ఆమె డ్రైవర్ వీరంగం సృష్టించి లారీ డ్రైవర్ని రక్తం వచ్చేటట్టు కొట్టిన వీడియో వైరల్ అవుతోంది.  ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు   మల్కాపురం పోలీస్ స్టేషన్లో ఈ దాడి కి పాల్పడ్డ వారిపై చర్య తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ పార్వతిని  ఇప్పటికే అధికారులు విజయవాడ కు అటాచ్ చేశారు.