Current Date: 04 Oct, 2024

శ్రావణ్ షిప్పింగ్ కంపెనీలో ప్రమాదం

విశాఖలోని పారిశ్రామిక ప్రాంతం ములగాడలో ఉన్న శ్రావణ్ షిప్పింగ్ కంపెనీలో శుక్రవారం రాత్రి ప్రమాదం సంభవించింది. ఓ కంటైనర్ నుంచి మరో కంటైనర్ లోకి సరకు లోడింగ్ చేస్తుండగా ఒక బ్యాగ్ నుంచి ప్రమాదకర కెమికల్ పౌడర్ లీక్ కావడంతో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు ప్రాథమిక0గా తేల్చారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో షీలానగర్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ హరీంధర్ ప్రసాద్, పోలీసులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఉన్నారు. ప్రమాద సంఘటనకు సంబంధించి గణబాబు పూర్తి వివరాల్ని కార్ముకులు, సంస్థ ప్రతినిధులు, స్థానిక ఆడిగికారుల్ని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితులు, యోగక్షేమాలను, వైద్యం అందుతున్న వైనాన్ని వారి కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకున్నారు. బాధితులెవరూ భయపడాల్సిన పని లేదని, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు, శ్రావణ్ షిప్పింగ్ యాజమాన్యాన్నీ ఎమ్మెల్యే గణబాబు కోరారు.

Share