తెలంగాణ నుంచి ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఐఏఎస్ అధికారులకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి కాటాను ఏపీ టూరిజం ఎండీగా నియమించింది. ఆలాగే ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా ఆమ్రపాలికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఐఏఎస్ ఆధికారుల బదిలీల వ్యవహారం ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ అధికారులు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లాలంటూ అక్టోబర్ 9న డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 16లోగా సొంత రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ఐఏఎస్ ఆధికారులను ఆదేశించింది. అయితే డీవోపీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఐఏఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు. తాము ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా ఆదేశించాలంటూ క్యాట్‌లో పిటిషన్ వేశారు. అయితే క్యాట్‌లో వారికి ఊరట లభించలేదు. డీవోపీటీ ఆదేశాలను పాటించాలని క్యాట్ తీర్పు ఇచ్చింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తన మార్క్ చూపించిన ఆమ్రపాలి.. ఏపీలో ఎలా తనని తాను నిరూపించుకుంటారో చూడాలి.
Share