Current Date: 19 Nov, 2024

52 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోబోతున్న నాగార్జున లక్కీ హీరోయిన్

బాలీవుడ్ నటి టబు ఐదు పదుల వయస్సు దాటిన తర్వాత పెళ్లిపీటలు ఎక్కబోతోంది. నిన్నే పెళ్లాడతా, ఆవిడా మావిడే వంటి సినిమాలలో అక్కినేని నాగార్జునకు జోడిగా నటించారు. ఈ మూవీ తర్వాత ఇద్దరి మధ్య మంచి చనువు ఏర్పడిందని కూడా గతంలో వార్తలు వచ్చాయి. నాగార్జున , టబుల మధ్య సీక్రెట్ ఎఫైర్ నడించిందని, టబు నాగార్జునను పెళ్లి కూడా చేసుకొవాలని భావించిందంట. కానీ అనివార్య కారణాల వల్ల నాగార్జునతో పెళ్లి జరగలేదంట. కానీ వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ కూడా.. గతంలో అనేక రూమర్స్ వార్తలలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ లేడీ బ్యాచీలర్ గా టబును చెప్పుకొవచ్చు. ఈ సీనియర్ నటి 52 ఏళ్ల వయస్సులో కూడా ఇంకా పెళ్లి చేసుకొలేదు. అయితే.. హిందిలో అజయ్ దేవ్ గణ్ లతో లవ్ ఎఫైర్ లు నడిపిందని కూడా అప్పట్లో వార్తలు జోరుగా వచ్చాయి. ఇప్పుడు టబు పెళ్లి చేసుకొనేందుకు సిద్దమైనట్లు వార్తలు మాత్రం బాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.అంతే కాకుండా.. ఒక బాలీవుడ్ నటుడితో ప్రేమలో ఉన్నారని, ఆయన ఆమె కంటే వయస్సులో చిన్నొడని, తొందరలోనే వీరు పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారని కూడా వార్తలు జోరుగా వస్తున్నాయి.

Share