Current Date: 28 Aug, 2026

బర్త్ డే పార్టీలో ఘర్షణ.. కత్తిపోట్లు

విశాఖలోని ఓ రిసార్ట్‌లో బర్త్ డే పార్టీలో ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో వెంకట దినేశ్‌ను చరణ్ తేజ్ కత్తితో పొడిచినట్లు సమాచారం. తీవ్ర గాయాలైన వెంకట దినేశ్ విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేశారని సీఐ ఎర్రమనాయుడు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.